అగ్ని బాధితులను ఆదుకోవడం అభినందనీయం
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్‌తెలుగు/వినుకొండ : అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుని, ఇల్లు కట్టించి ఇచ్చిన శాంతి ఆశ్రమ ట్రస్ట్ ను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు అభినందించారు. వినుకొండ మండలం విఠం రాజు పల్లి ఎస్సీ కాలనీలో పూజ శ్రీ హిమాలయ గురువుల ఆశీస్సులతో శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు అగ్ని బాధ్యత పేదల గృహాలను గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు ప్రారంభించారు. గత ఏడాది మే నెలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమావేశానికి ఎస్సీ కాలనీలోని పాలేటి శోభన్ బాబు, చిరంజీవి, మరియదాసు ఇల్లు దగ్ధం కాగా బాధితులు హిమాలయ గురూజీని ఆశ్రయించడంతో వారి శిష్య బృందం సహకారంతో అగ్ని బాధితులకు ఇల్లు నిర్మించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం నుండి అగ్నిపాయత కుటుంబాలను ఆదుకొని పక్కా గృహాలు నిర్మాణం చేపటట్టి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాదిత కుటుంబాలను ఆదుకోకుండా అన్యాయం చేసిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, నాగ శ్రీను రాయల్, డాల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (Story : అగ్ని బాధితులను ఆదుకోవడం అభినందనీయం)