Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సాలూరులో డిసెంబర్ 31 న ఆంక్ష‌లు

సాలూరులో డిసెంబర్ 31 న ఆంక్ష‌లు

 సాలూరులో డిసెంబర్ 31 న ఆంక్ష‌లు


న్యూస్ తెలుగు/సాలూరు ;
సాలూరుపట్టణంలో డిసెంబర్ 31 న సాంస్కృతిక కార్యక్రమాలకు, లౌడ్ స్పీకర్లకు, మ్యూజిక్ సిస్టములకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని, మద్యం సేవించి ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు అన్నారు. సోమవారం సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రధానంగా మద్యం మత్తులో వాహనాలు నడిపిన, రోడ్డుపైన అసభ్యకరంగా ప్రవర్తించిన , చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. హోల్డింగ్స్ లలో అసభ్యకరంగా ప్రకటనలు చేయరాదని అన్నారు. వేడుకలలో అశ్లీల నృత్యాలు, చర్యలు, అశ్లీల సంజ్ఞలు ఆనుమతించబడవని అన్నారు. అంబర్ కి శాఖ అనుమతి లేనిదే మద్యం అమ్మ రాదని అన్నారు. నిషేధిత పేలుడు పదార్థాలు ఉపయోగించరాదని అన్నారు. అలా చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు.పబ్లిక్ ప్రదేశాలలో లిక్కర్ సేవించుట మరియు పేకాట ఆడుట నిషేధమని అన్నారు
మద్యం త్రాగి వాహనములు నడిపే వారిపై, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి. ఇందుకు గాను అన్ని కూడళ్ళ లో అల్కో మీటర్లు ఉపయోగించి మద్యము త్రాగి వాహనములు నడిపిన వారి ఎం వి ఐ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. జనాలు లేని ప్రదేశాల్లోమహిళలు ఒంటరిగా అర్ధరాత్రి తిరగవద్దు అనిఅన్నారు. బార్లు మద్యం షాపు యజమానులు టైం ప్రకారం నిర్ణీత సమయంలో షాపులు మూసివేయలని అన్నారు. పట్టణ మరియు పరిసర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన సాలూరు టౌన్ పోలీసు వారిని సంప్రదించాలని కోరారు. (Story : సాలూరులో డిసెంబర్ 31 న ఆంక్ష‌లు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!