కాంగ్రెస్ వచ్చిందిరా సాయన్న.. పంటలు ఎండు తున్నాయిరా నాగన్న పాటను విడుదల చేసిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం రాజానగరం గ్రామానికి చెందిన ఏరుపుల. భరత్ యాదవ్ నేడు సాగుతున్న కాంగ్రెస్ అరాచక,ప్రజా వ్యతిరేక పాలనపై మరియు రైతులు పడుతున్న గోసపై స్పందించి కాంగ్రెస్ వచ్చిందీరా సాయన్న…. పంటలు ఎండిపోతున్నాయిరా నాగన్న అంటూ పాటను స్వయంగా రచించి రాష్ట్ర మాదిగ దండోరా నాయకులు మీసాల.రామన్న గారి సంగీత దర్శకత్వంలో రూపొందించారు. ఇట్టి పాటను మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కవులు, కళాకారులు,మేధావులు కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై,ప్రజా నిర్బంధాలపైన స్పందించాలని పిలుపునిచ్చారు. భరత్ యాదవ్ ప్రజల కష్టాలను కండ్లకు కట్టినట్లు పాడుతూ మంచి పాట రూపొందించారని అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మీసాల.రామన్న,గంధం.నాగరాజు, పి.కురుమూర్తి యాదవ్,వాకిటి.శ్రీధర్,పి.రమేష్ గౌడ్,కె.మాణిక్యం,బండారు.కృష్ణ,నాగన్న యాదవ్,స్టార్.రహీమ్,గులాం ఖాదర్ ఖాన్,రవిప్రకాష్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,జంగమాయపాల్లి. నాగేంద్రం,మాధవ్ రెడ్డి, ఇమ్రాన్,చిట్యాల.రాము, ద్యానియల్,శివ,లక్ష్మణ్, గొర్ల.ప్రేమ్ కుమార్ ,రామస్వామి,బాబు నాయక్,సత్యనారాయణ చారి,హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : కాంగ్రెస్ వచ్చిందిరా సాయన్న…. పంటలు ఎండు తున్నాయిరా నాగన్న పాటను విడుదల చేసిన మాజీ మంత్రి)