Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌టిడిపి నేత మక్కెనను విమర్శిస్తే సహించేది లేదు..

టిడిపి నేత మక్కెనను విమర్శిస్తే సహించేది లేదు..

టిడిపి నేత మక్కెనను విమర్శిస్తే సహించేది లేదు..

– వినుకొండలో గొడవలు సృష్టించేందుకు కుట్ర
– చెడ్డి గ్యాంగ్ ఏర్పాటుచేసి వినుకొండను దోచుకున్న బొల్లా, ఎంఎన్

న్యూస్‌తెలుగు/వినుకొండ: సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే వరకు ఎన్నో పదవులను అధిరోహించి కొన్ని దశాబ్దాలుగా ప్రజలకు సేవలందించిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి ఎం. ఎన్ ప్రసాద్ చేసిన విమర్శలను వినుకొండ టిడిపి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం సాయంత్రం టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టిడిపి సీనియర్ నాయకులు డిఎల్డిఏ లగడపాటి వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తుంటే ఓర్వలేని వైసిపి శక్తులు గొడవలు రెచ్చగొట్టేందుకు అసత్యాలు మాట్లాడుతూ విమర్శించడం దారుణమన్నారు. సర్పంచ్ నుండి ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మక్కిన మల్లికార్జునరావు ఎటువంటి స్థాయి లేని ఎంఎన్ ప్రసాద్ విమర్శించడానికి చూస్తే వైసీపీ అలజడ్లు సృష్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే అత్యధికంగా ఓటింగ్ వచ్చిన నాయకుడు మక్కెనేని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నాసిరకం మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వైసీపీ నాయకులు నేడు బెల్ట్ షాపుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు. ప్రముఖ న్యాయవాది రామకోటేశ్వరరావు మాట్లాడుతూ 2006లో గుమ్మనంపాడు అగ్రహారం భూములను అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన వ్యక్తి ఎమ్మె ప్రసాద్ అని ఆరోపించారు. వైసిపి పాలనలో చెడ్డి గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్ పేరుతో వినుకొండ అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. అప్పటి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి దౌర్జన్యాలు దుర్మార్గాలు పాల్పడలేదా అని ప్రశ్నించారు. పేదల పక్షాన నిలిచి పోరాడే వ్యక్తి లాయర్ మూర్తి పై దుర్మార్గంగా ఎస్సీ ఎస్టీ కేసు బనయించారని, ఇటువంటి ఎన్నో దౌర్జన్యాలు దుర్మార్గాలు అకృత్యాలు మీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో వైసిపి దుండగులు చేసిన దాడుల్లో తలలు పగిలి చేతులు కాళ్లు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు తీసుకొని దుస్థితిలో ఎన్నో ఉన్నాయన్నారు. ప్రశాంతంగా ఉన్న వినుకొండలో విష సంస్కృతిని తీసుకువచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. పివి సురేష్ బాబు మాట్లాడుతూ వినుకొండ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా హెచ్దిది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు నైతిక విలువలేని ఎంఎన్ ప్రసాద్ విమర్శించడం సహించరానిదన్నారు కి అన్నారు. పదవుల కోసం పార్టీ మారే నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి ఎంఎన్ అని తప్పుడు ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పెమ్మ సాని నాగేశ్వరరావు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ ప్రజలు కూటమికి 31 వెయ్యి మెజారిటీ ఇచ్చి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిచ్చిన మీకు సిగ్గు రాలేదా అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎటువంటి అర్హత స్థాయి లేనటువంటి ఎంఎన్ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పై విమర్శలు చేయటం తగదన్నారు. ఆరు నెలల్లో వినుకొండ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంటే వ్యసనంతో వైసిపి వినుకొండలో గొడవలు, అల్లర్లు అలజల్లు సృష్టించేందుకు అసత్య ఆరోపణలు చేస్తూ సబింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని ఇటువంటి వ్యక్తులకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. (Story : టిడిపి నేత మక్కెనను విమర్శిస్తే సహించేది లేదు..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics