పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
న్యూస్ తెలుగు/వనపర్తి : ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 40ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. శ్రీరంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-84 వరకు చదివిన60 మంది పూర్వ విద్యార్థులు ఆదివారం పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో సహారా ఫంక్షనాల్లో కలుసుకున్నారు.ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తించేసుకుంటూ ఆనందంగా గడిపారు. అప్పటి గురువులు రాఘవాచారి, సూర్యనారాయణ,సుగుణ బ్రహ్మం,వరదరాజులను ఆహ్వానించారు న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు,కావలి గోవింద్,అనిత ఉపాధ్యాయురాలు, కురుమూర్తి ఉపాధ్యాయుడు, రఘునాథరెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,డాకేష్ గౌడ్,రంగస్వామి, స్వాతి ఫోటో స్టూడియో మేనేజర్,గురువులను శాలువతో సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నరు.(Story : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం )