ప్రతి నర్సరీ ఒక ప్రయోగశాలే..ప్రతి రైతు ఓ శాస్త్రవేత్తే..!
కర్ణాటక రాష్ట్రం హార్టికల్చర్ డిడి విశ్వనాథ శర్మ
న్యూస్తెలుగు/ చింతూరు : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో విస్తరించిన ప్రతి నర్సరీ ఓ ప్రయాగశాలేనని, ప్రతి రైతు ఓ శాస్త్రవేత్తేనని కర్ణాటక రాష్ట్రం హార్టికల్చర్ డిడి విశ్వనాథ శర్మ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం పలు జిల్లాలకు చెందిన 25 మంది ఉద్యానవన శాఖ అధికారులు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో గల కొత్త మొక్కల ఉత్పత్తి కేంద్రాలైన శ్రీ సత్యదేవ నర్సరీ, పల్ల వెంకన్న నర్సరీ, శ్రీ సత్యనారాయణ నర్సరీ, శ్రీ వెంకట శ్రీనివాస నర్సరీ, శ్రీ గౌతమి నర్సరీలలో నూతనంగా రూపుదిద్దుకుంటున్న పలు రకాల మొక్కలను శ్రీ దుర్గా నర్సరీ అధినేత పెద్దిరెడ్డి శ్రీనివాసు ఆధ్వర్యంలో పరిశీలించారు. నర్సరీ రైతులు రూపకల్పన చేస్తున్న పలు రకాల మొక్కల శాస్త్రీయ నామాలను ఆ మొక్కల వల్ల ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ తయారవుతున్న మొక్కలు ప్రకృతిలో సంభవిస్తున్న కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రిస్తుందని నర్సరీ రైతులు వెల్లడించారు. వివిధ పళ్ళ జాతి మొక్కలతో పాటు సప్త వర్ణాల దళాలు, పుష్పాలుతో సూపరులను కనువిందు చేస్తున్న మొక్కలను పరిశీలించి ప్రపంచంలో గల వింతైన మొక్కలు ఈ ప్రాంతంలోనే ఉత్పత్తి చేయడం నర్సరీ రైతుల విజ్ఞానాన్ని అభినందించక తప్పదని పేర్కొన్నారు. అనంతరం కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్ ను పరిశీలించి మార్కెట్ విధి విధానాలపై మార్కెట్ యాజమాన్యం నుండి అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక ఉద్యానవన అధికారులకు పుల్లా పెద్ద సత్యనారాయణ, గంగుమళ్ళ సత్యనారాయణ, పల్లా సత్తిబాబు, మల్లు పోలరాజు, మార్గాని సత్యనారాయణ, చిలుకూరి త్రిమూర్తులు, మార్గాని వీరబాబు, పాఠంశెట్టి బాబ్జీ, పాఠంశెట్టి బూరయ్య రైతులు ఈ మొక్క యొక్క విశిష్టతను వివరించారు. (Story : ప్రతి నర్సరీ ఒక ప్రయోగశాలే..ప్రతి రైతు ఓ శాస్త్రవేత్తే..!)