మద్యం బెల్ట్ షాపులపై సిపిఐ ఆందోళన
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రామాల్లో బెల్ట్ షాపులు పెడితే వారి తాట తీస్తానని పదే పదే చెబుతున్నా గ్రామాల్లో మంచినీటి కంటే బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులైపోతుందని, సీఎం మాటలు కూడా లెక్కచేయకుండా గ్రామాల్లో బెల్ట్ షాపులు, వినుకొండ మండలం కొండ కింద ఉప్పరపాలెం గ్రామంలో బెల్ట్ షాపులు వల్ల కుటుంబాల్లో గొడవలు ఎక్కువగా పెరిగిపోయి భార్యాభర్తలు, పిల్లలు కొట్టుకొని పోలీస్ స్టేషన్ పాలవుతున్నారని, అదేమని పెద్దలు మందలిస్తే ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అధికారులు వెంటనే స్పందించి కొండ కింద ఉప్పరపాలెం గ్రామంలో బెల్ట్ షాపులు వెంటనే తీసివేయాలని శుక్రవారం వినుకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఎక్సైజ్ సి. ఐ. శ్రీనివాస్ కి సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామాల్లో బెల్ట్ షాపులు పెడితే వారి బెండు తీస్తామని, బెల్టు షాపులు జోలు అధికార పార్టీకి చెందిన వారు ఎవరెల్లిన ఉపేక్షించేది లేదని పదేపదే చెబుతున్న కూడా గ్రామాల్లో మంచినీరు కంటే బ్రాందీ, విస్కీలు ఏరులైపోతున్నాయని, దీనివలన చిన్నాచితక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, మందు తాగిన వారిని పెద్దలు మందలిస్తే వారు ఎలుకల మందు తిని సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దీనివల్ల సుమారుగా ఎలుకల మందు తిని 25 మంది దాకా చనిపోయారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉప్పరపాలెం గ్రామంలో బెల్టు షాపులు వెంటనే తీయించేయాలని, లేని పక్షంలో ఉప్పరపాలెం గ్రామ ప్రజలతో సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వందనం, కొప్పరపు మల్లికార్జున, దావీదు, రవణమ్మ ,కాశమ్మ, పేరమ్మ, దుర్గమ్మ, తదితర ఉప్పరపాలెం గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(Story : మద్యం బెల్ట్ షాపులపై సిపిఐ ఆందోళన)