కోస్టల్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక కొత్తపేట లోని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో గురువారం బ్యాంకు ఆవరణ నందు ఉచిత మెగా వైద్యం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ జే అరవింద్ బాబు మాట్లాడుతూ. కోస్టల్ బ్యాంకు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలలో సందర్భంగా పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ పివి చలపతిరావు, దంత వైద్యులు ఘంటసాల నవీన్ కుమార్, బ్యాంకు ఖాతాదారులకు వైద్య సేవలు మరియు మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారుల ఆధ్వర్యంలో పట్టణ పురవీరుదుల నందు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు పెనుగొండ శివప్రసాదరావు, గజవల్లి నాగ పవన్ కుమార్, చందోలు చిన్న నరసయ్య, వెంకటేశ్వర శర్మ, రఫీ, బ్యాంకు సిబ్బంది జె .అరవింద్, డి సి హెచ్. వెంకటేశ్వర్లు, సయ్యద్ నాగూర్ బి, కొల్లి హరిబాబు షేక్. గౌసియా మరియు షేక్. మస్తాన్, తదితరులు పాల్గొన్నారు. (Story : కోస్టల్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం)