సిపిఐ నేత మంగరాజు సేవలు
మరువలేనివి. జే. వి. యస్.
న్యూస్‌తెలుగు/చింతూరు: సీపీఐ నేత కామ్రేడ్ కందుకూరి మంగరాజు సేవలు మరువలేనివని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. బుదవారం
ఎటపాక మండలం గన్నవరం గ్రామంలో సిపిఐ నాయకులు, మాజీ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు,స్వర్గీయ అమరజీవి కామ్రేడ్ కందుకూరి మంగరాజు వర్ధంతి సందర్భముగా అయన స్థూపానికి నివాళ్ళ్ళు అర్పించి మాట్లాడారు. ముందుగా ఆయన స్టూపం వద్ద సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి , అల్లూరి జిల్లా కార్యదర్శి పోట్టిక సత్యనారాయణ , కుటుంబ సభ్యులు ఆయన సతీ మణి ఉప సర్పంచ్ కందుకూరి స్వర్ణ, కుమారుడు సుధీర్ చంద్ర, సీపీఐ బృందం నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్య ల పై పోరాడినా నేతని, పోలవరం నిర్వాశితుల సమస్య లపై తను చివరి వరకు పోరాడినా వ్యక్తి మంగరాజనీ, అయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. నిత్యం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టీ వారికి న్యాయం జరిగే వరకు ప్రజల నిలబడి వారి పక్షాన పోరాడేవారని, అంతే కాకుండా నిర్వాసిత సమస్యలు, పై ధర్నాలు చేపట్టి వారికి న్యాయం జరిగేలా పోరాడేవారన్నారు. అటువంటి నాయకులు మన మధ్యలేకపోవడం దురదృకరమని అన్నారు. సిపిఐ పార్టీ కి అయన తీరని లోటని తెలిపారు. ఈ కార్యక్రమం లో డివిజన్ నాయకులు గుజ్జా మోహన్ రావు, సహాయ కార్యదర్శి వాసం రాము, ఎంపీటీసీ కంటే రాజు , మండల కార్యదర్శి ఎలీషాల, నాగరాజు, లంబు శ్రీనివాసరావు,
వళ్లభ నేని సత్య నారాయణ బలుసు పాపారావు, కర్నాటి ఏసు, చూడ చంద్రరావు, పద్దం సత్తెమ్మ ,వరదా బ్రహ్మం, కందుకూరి సూర్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు. (Story : సిపిఐ నేత మంగరాజు సేవలు మరువలేనివి. జే. వి. యస్.)