అయ్యప్ప స్వామి మహపడి పూజకు
రావుల లక్ష ఆర్థిక సహకారం
న్యూస్‌తెలుగు/వనపర్తి : అయ్యప్పస్వామి దేవాలయములో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహింపబడే అయ్యప్ప మండల మహపడిపూజకు రావుల చంద్రశేఖర్ రెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందించారు అని నందిమల్ల.అశోక్ తెలిపారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రతి మండల పూజకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా దేవాలయ అభివృద్ధి కోసం ఎం.పిగా నిధులు కేటాయించారని అదేవిధంగా దేవాలయ ముఖద్వారం వారి తల్లి వెంకటపద్మమ్మ పేరిట నిర్మించారని అశోక్ తెలిపారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డి మొదటి నుండి గుడికి సహకారం అందిస్తున్నారని వారు ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఉండాలని గురుస్వాములు,ఆలయ కమిటీ ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నగేష్, గట్టు.వెంకన్న,ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ, నందిమల్ల.అశోక్,రంగం.శ్రీను, సంద.రమేష్,వెంకటేష్, పెండెమ్.శ్రీను,బాలు నాయుడు గురుస్వాములు ఉన్నారు. (Story : అయ్యప్ప స్వామి మహపడి పూజకు రావుల లక్ష ఆర్థిక సహకారం)