శారీరక దృఢత్వానికి మందులే కాకుండా
మనోధైర్యం ఉండాలి..
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో.. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్..
న్యూస్‌తెలుగు/చింతూరు : తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సీనియర్ నేత ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం నిమ్మల గూడెం గ్రామంలో ఉన్న ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకె సెట్ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ ఆశ్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు కరచాలనం చేసుకొని ఉత్సాహభరిత వాతావరణం లో మాట మంతి కొనసాగించారు. జమాల్ ఖాన్ సేవా కార్యక్రమాలను మీడియా మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వీరభద్రం మాట్లాడుతూ ప్రపంచానికి ప్రస్తుతం కావాల్సింది ఆరోగ్యం అందించే నాణ్యమైన వైద్యమే అని నేటి సమాజంలో రసాయనిక జంక్ ఫుడ్స్ కలుషిత ఆహారాలు తీసుకుంటున్న మనుషులు రోజుకో కొత్త వ్యాధులతో బాధపడుతున్నారని దీనివల్ల కుటుంబానికి దేశ ఆర్థిక వ్యవస్థ పై తీరని ప్రభావం పడుతుందని అన్నారు. జమాల్ ఖాన్ మాట్లాడుతూ ఆయుష్ కంపెనీ అటవీ శాఖ వారు ముందుకు వచ్చి సహకరిస్తే విలువైన ఔషధ మొక్కలు పెంచే దిశగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔషధ మూలికలు అందించే దిశగా కృషి చేయవచ్చన్నారు. అలో పతి కంటే ఆయుర్వేదంలోనే దీర్ఘకాలిక వ్యాధులకు సరైన ఔషధనం కలిగి ఉందని రాబోయే తరాల వారికి ఆయుర్వేద వైద్యమే దివి ఔషధంగా సంజీవినిల ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇరువురి సంభాషణలు ఆహ్లాదకర ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి . ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ సిపిఎం నాయకులు బ్రహ్మచారి. చింతూరు సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు పల్లపు వెంకట్.సీసం సురేష్. పోడియం లక్ష్మణ్. కారం సుబ్బారావు. తదితరులు పాల్గొన్నారు. (Story : శారీరక దృఢత్వానికి మందులే కాకుండా మనోధైర్యం ఉండాలి..)