చిడుమూరు గ్రామపంచాయితీ లో రెవిన్యూ సదస్సు
న్యూస్‌తెలుగు/చింతూరు : చీడుమురు గ్రామ పంచాయతీకి చెందిన బురక్కన కోట, కన్నాపురం, నరసింహపురం గ్రామములలో మంగళవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు . ఈ గ్రామ సభకు చీడుమురు గ్రామ సర్పంచ్, శ్రీమతి కాక అరుణ కుమారి, తహసీల్దార్ యస్. చిరంజీవి బాబు, ఆర్. ఐ విగ్నేష్, గ్రామ రెవిన్యూ అధికారులు కారం దారయ్య గ్రామ సర్వేయర్లు అనిగి సాగర్ బాబు, పారెస్టు డిపార్ట్మెంట్ ఎఫ్ ఎస్ ఓ , టి. సాయి వెంకట రమణ, పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయ, చింతూరు సిబ్బంది డి ఈ ఓ స్.డి.ఉదయ్, యస్. మంగ తయారు మరియు మెడికల్ డిపార్ట్మెంట్ కిషోర్ కుమార్ ఒప్తలమిక్ ఆఫీసర్, ఆశ వర్కర్ సిబ్బంది గ్రామ సభలకు హాజరు అయ్యినారు.
ఇందులో భూమి సంబంధిత సమష్యల అనగా, ఆన్లైన్ నమోదు కొరకు, పట్టా మార్పుల కొరకు, అసైన్ మెంట్ పట్టాలు కొరకు, భూమి సర్వే కొరకు, విస్తీర్ణం తప్పులు, కొత్తగా పాస్ పుస్తకం కొరకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు కొరకు దరఖాస్తులు తీసుకోవటం జరిగినది, రెవిన్యూ దరఖాస్తులు. 21 స్వీకరించారు.
మెడికల్ సంబంధించి 38 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు.(Story : చిడుమూరు గ్రామపంచాయితీ లో రెవిన్యూ సదస్సు)