చిన్నార్కుర్ పెసా ఉపాధ్యక్ష,కార్యదర్శులు ఏకగ్రీవఎన్నిక
న్యూస్‌తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం చిన్నార్కూరు పంచాయతీలో పెసా ఎన్నిక మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో ఉపాధ్యక్ష,కార్యదర్శులుగా కారం.దారయ్య కుంజా.అనిల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తమపై ఎంతో బాధ్యతతో ఈ పదవులు తమకు ఇవ్వడం జరిగిందని, ఈ గ్రామ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయబోమని, చట్టానికి అనుగుణంగా ప్రతి పనిలోనూ అందరి సహకారాలతో తమ బాధ్యతలను స్వీకరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో భూ సమస్యలు, అటవీ సమస్యలు,వలస గిరిజనేతరుల సమస్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ పెసా కమిటీలు ఏర్పాటు చేయడం. ఈ ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉంటున్న ఆదివాసులందరికీ ఒక విముక్తి లాంటిదని, ఎంతో కార్య శుద్ధితో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషికి ధన్యవాదాలు తెలియజేశారు. (Story : చిన్నార్కుర్ పెసా ఉపాధ్యక్ష,కార్యదర్శులు ఏకగ్రీవఎన్నిక)