ఐఐటి మ్యాథ్స్ ఒలంపియాడ్ విజేతలకు
బహుమతి ప్రధానం..
న్యూస్ తెలుగు / వినుకొండ : గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా మ్యాట్రిక్స్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఆదివారం ఐఐటి మ్యాచ్ ఒలంపియాడ్ పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో పట్టణంలోని పలు విద్యాసంస్థల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాట్రిక్స్ జూనియర్ కాలేజ్ అధినేత రామిరెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులు గణిత శాస్త్ర నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. ఆధునిక ప్రపంచంలో గణితానికి ఎనలేని ప్రాధాన్యత ఉందని చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులు సూర్యతేజ, హనుమంత రెడ్డి మాట్లాడుతూ. ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థిని, విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు, వివిధ పాఠశాల మరియు కళాశాలల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గీతాంజలి కిషోర్, గీతమ్స్ మాలపాటి కోటిరెడ్డి , వివేకానంద విద్యాసంస్థ రఫీ, గుడ్ షెఫర్డ్ స్కూల్ ఇన్నారెడ్డి, గీతమ్స్ గ్లోబల్ మైండ్ నారాయణ, పాంచ జన్య స్కూల్ శ్రీనివాసరావు, నిర్మల స్కూల్ యాజమాన్యం, శర్మ స్కూల్ యాజమాన్యం, విజేత విద్యాసంస్థ సాయి, సాధన ట్యూషన్స్ బాష తదితరులు పాల్గొన్నారు. (Story : ఐఐటి మ్యాథ్స్ ఒలంపియాడ్ విజేతలకు బహుమతి ప్రధానం..)