Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఐకమత్యమే మహాబలం

ఐకమత్యమే మహాబలం

0

ఐకమత్యమే మహాబలం

సంఘటిత పోరాటాలే సమస్యలకు పరిష్కారం

నూర్ భాషా దూదేకుల జన గర్జనలో జమాల్ ఖాన్

న్యూస్‌తెలుగు/చింతూరు : సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలు ఐకమత్యతే సంఘాలకు మహాబలమని సంఘటిత పోరాటాలే సమస్యలకు పరిష్కారం అని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకేసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ విశాఖ జిల్లాలోని పెందుర్తి ప్రశాంతి నగర్ పోర్టు కళ్యాణ మండపం నందు శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నూర్ భాషా దూదేకుల జన గర్జన ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడినారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది నూర్ భాషా దూదేకుల జనాభా కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. నూర్ భాషాల వెనుకబాటు తనము భాష, భేద వైరుధ్యం తదితర అంశాలపై మాట్లాడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అభివృద్ధి చెందుతున్న ఇతర జాతి కుల సంఘాల వలె నూర్ భాషా దూదేకుల సంఘాలు కూడా ఆత్మ అభిమాన గౌరవ సాధనకై ప్రభుత్వ పాలన వ్యవస్థలో తగిన భాగస్వామ్యం పొందాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో ప్రశ్నించాలంటే శాసన సభ్యుల సీట్లు కూడా నూర్ భాషాలు పొందాల్సిన అవసరం ఉందన్నారు. యువజన మహిళ ఉద్యోగ, వ్యాపార, ఔత్సాహిక, పారిశ్రామికవేత్తలు సన్న చిన్న కారు వ్యవసాయ చేతివృత్తి కార్మికుల సంక్షేమం అభివృద్ధి వంటి వాటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పురోగతిని సాధించాలన్నారు. అనంతరం మాజీ శాసన మండలి చైర్మన్. రాష్ట్ర మైనార్టీ సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ వాస్తవంగా నూర్ భాషా దూదేకుల ఆర్థిక పరిస్థితి చాలా దయానింగా ఉందని గతంలో 50 కోట్ల రూపాయలు దూదేకుల సంక్షేమ నికి కేటాయించగా ప్రభుత్వం మారడంతో నిధులు వెనక్కి వెళ్లి పోయాయాన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా దూదేకుల ఆధారాభిమానాలు టిడిపి ప్రభుత్వానికి మెండుగా ఉన్నాయని సంక్షేమానికి ఆర్థిక వనరులు కల్పించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ప్రధాన లక్ష్యాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ వారీగా బీసీ ముస్లిం కుటుంబాల సర్వే సమగ్ర ప్రణాళిక అభివృద్ధి కి కావాల్సిన వ్యవస్థీకృత నిధులు ఏర్పాటుకు కృషి చేయాలి, దూదేకుల కులవృత్తి ప్రత్యామ్నాయంగా రి హ్యాబిలిటేషన్ దిశగా ప్రత్యేక ఉపాధి భరోసా పథకమును అమలుపరచుటకై కృషి చేయాలి అని పలు లక్ష్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సభకు అధ్యక్షులుగా ఇస్మాయిల్ వ్యవహరించారు. ఎస్కే షఫీ ఉల్లా ముస్లిం మైనారిటీ అసోసియేషన్ అధ్యక్షులు, నూర్ భాషా దూదేకుల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డి మస్తాన్ బి, రాష్ట్ర నూర్ భాషా సంఘ అధ్యక్షులు కే పీర్ మహమ్మద్, ముస్లిం మైనార్టీ సాధికార ప్రతినిధి సుభాన్, షేక్ షఫీ ఉల్లా, షేక్ అబ్దుల్లా, సలీం, షేక్ రెహమాన్ ప్రముఖులు పాల్గొన్నారు. (Story : ఐకమత్యమే మహాబలం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version