Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పక్కా సమాచారంతో 117.100 కిలోల గంజాయిన పట్టేసిన పోలీసులు

పక్కా సమాచారంతో 117.100 కిలోల గంజాయిన పట్టేసిన పోలీసులు

0

పక్కా సమాచారంతో 117.100 కిలోల గంజాయిన పట్టేసిన పోలీసులు

న్యూస్ తెలుగు/విజయనగరం : ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలోని బొడ్డవర చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి, పక్కా సమాచారంతో 117.100 కిలోల గంజాయిని, బొలేరో వాహనంలో అక్రమ రవాణకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్.కోట పోలీసులు అరెస్టు చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో డిసెంబరు 20న నిర్వహిచిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ వివరాలను వెల్లడించారు.వివరాల్లోకి వెళ్ళితే.. ఎస్.కోట పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఎస్.కోట సిఐ వి.ఎన్.మూర్తి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది డిసెంబరు 19న బొడ్డవర చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, ఒడిస్సా రాష్ట్రం నుండి ఇద్దరు వ్యక్తులు కేఎల్ 48జె 5309 బొలేరో వాహనంలో గంజాయిని కేరళ రాష్ట్రంకు తరలిస్తూ పట్టుబడారన్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారణ చేయగా కేరళ రాష్ట్రంకు చెందిన రామ్ అనే వ్యక్తి ఆదేశాలతో నిందితులు ముందుగా అరకు వచ్చి, అక్కడ వేరే వ్యక్తుల సహకారంతో ఒడిస్సా రాష్ట్రంకు వెళ్ళి, 117.100 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, ఎవ్వరికీ అనుమానం రాకుండా వాహనం వెనుక భాగంను ఒక అరగా మార్పు చేసి, దానిలో గంజాయిని డంప్ చేసి, కేరళ రాష్ట్రంకు తరలిస్తుండగా పట్టుబడ్డారన్నారు. నిందితులు ఎ-2, ఎ-3 ఇరువురు కేరళ రాష్ట్రం త్రిశ్సూర్ జిల్లా చెర్పుకు చెందిన (ఎ-2) అన్సర్ పి.ఎ. అలియాస్ పడిక్కవిట్టి అన్సర్ (36 సం.లు) (ఎ-3) ఫిరోస్ కే.కే. (28 సం.లు) గా గుర్తించామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 117.100 కిలోల గంజాయి, బొలేరో వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ.10,310/-ల నగదు సీజ్ చేసామన్నారు. పట్టుబడిన 117.100 కిలోల గంజాయి విలువ రూ. 5,85,500/-లు ఉంటుందని తెలిపారు. విచారణలో ఈ కేసుతో కేరళ రాష్ట్రంకు చెందిన రామ్తో సహా మరో ఇద్దరికి సంబంధం ఉన్నట్లుగా గుర్తించామని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు చెక్ పోస్టులు నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్న కారణంగా ఇటీవల గంజాయి పట్టుకోగలుగుతున్నామని, చెక్ పోస్టుల్లో సిబ్బంది పని తీరు బాగుందన్నారు. గంజాయి పట్టుకోవడంలో సమర్ధవంతంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్. కోట సిఐ వి.నారాయణ మూర్తి, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.(Story : పక్కా సమాచారంతో 117.100 కిలోల గంజాయిన పట్టేసిన పోలీసులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version