కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేసిన వైద్యమిత్ర
న్యూస్ తెలుగు / వినుకొండ : కేంద్ర సహాయ శాఖ గ్రామీణ అభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ నందు ఆంధ్రప్రదేశ్ వైద్య మిత్ర ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి వైద్య మిత్రుల సమస్యల గురించి సోమవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమాన పనికి సమాన వేతనం, కేడర్ ఉద్యోగ భద్రత మరియు సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో 25 వేల లోపు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని నెరవేర్చే విధంగా ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేయాలని జనవరి నెల నుండి కొత్త రేషన్ కార్డులు, పింఛనులు, తల్లికి వందనం మొదలైన పథకాలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను మొదలుపెట్టే కసరస్తు చేస్తున్నదని రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి అన్నారు. తమరు కూడా ఈ విషయాన్నీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కార మార్గం చూపే విధంగా కేంద్ర మంత్రిగా మాకు సహకారం అందించి మీ ద్వారా రాష్ట్రంలోని వైద్య మిత్రాలందరికి న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి కి సమస్యలను లేక ద్వారా తెలియజేస్తారని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు ఐటి సహాయ శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని రాష్ట్ర వైద్య మిత్ర ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. (Story : కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేసిన వైద్యమిత్ర)