వనపర్తి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు
న్యూస్ తెలుగు / వనపర్తి : పెబ్బేరు పట్టణము మాస్టర్ మైండ్ స్కూలు మరియు జర్నలిస్టు కాలనీ పక్కల ఉన్న పకృతి వనము(ట్రీ పార్కు)ను రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. ఎలాంటి అనుమతి లేకుండా చేసిన ఇట్టి దుశ్చర్యను తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి పెబ్బేరు పట్టణ అఖిలపక్ష నాయకులు మరియు ప్రజలు పిర్యాదు చేయడం జరిగింది
వనపర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్ గారు పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి గారు వనపర్తి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గౌనీ హేమా రెడ్డి గారు అఖిలపక్ష నాయకులు బుర్ర మోని రాములు యాదవ్, కొంతo దయాకర్ రెడ్డి ,గౌని యుగంధర్ రెడ్డి ,మాజీ డైరెక్టర్ రాములు, యువ నాయకులు చెలిమెల్ల శివ,అన్నే శ్రీకాంత్,గోనల అరవింద్ మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. (Story : వనపర్తి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు)