ఏపీపీఎస్సీలో వివిధ పోస్టుల రాత పరీక్షలు ఎప్పుడంటే..
న్యూస్‌తెలుగు/అమరావతి : రాష్ట్రంలో ఇటీవల జారీ చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ పరీక్షలన్నీ వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ లైబ్రేరియన్ పరీక్ష 24, 25వ తేదీల్లో, ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డులోని అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, అనలిస్ట్ గ్రేడ్-2 పరీక్షలను 25, 26వ తేదీల్లో, విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష 26, 27వ తేదీల్లో జరగనున్నాయి.
మరియు సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ 2024 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను సీబీఎస్ఈ విడుదల చేసింది. సీటెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్పును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష డిసెంబర్14య ఆఫ్‌లైన్ విధానంలో ఓఎమ్మార్ ఆధారితంగా నిర్వహించనున్నారు. కాగా సీటెట్ పరీక్ష ప్రతి యేటా రెండు సార్లు జరుగుతుందన్న సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. మొదటి పేపర్ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి 9వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్‌ఖు లైఫ్లాంగ్వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 20 భాషల్లో సీటెట్ నిర్వహిస్తారు. (Story : ఏపీపీఎస్సీలో వివిధ పోస్టుల రాత పరీక్షలు ఎప్పుడంటే..)