ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం
మున్సిపల్ కమీషనర్
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేకమైన దృష్టి సారించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు ఆదేశానుసారం వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ రోజువారీ పట్టణ పర్యటనలు చేపట్టి అందులో భాగంగా స్థానిక ప్రజల సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. బుధవారం ఇంద్రానగర్ రైల్ పేట, అంబేద్కర్ కాలనీ పర్యటనలో ప్రజలతో వీధి దీపాలు , మంచినీటి సరఫరా, పారిశుధ్య పనులు, డ్రైన్స్ ఏర్పాటు వంటి పలు అంశాలపై ప్రజలను వారి సంతృప్తి స్థాయిని అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా వివిధ పురపాలక సేవలు త్వరితంగా పొందెందుకు పబ్లిక్ గ్రీవన్స్ రిడ్రెసల్ నంబర్ 9933585666 నకు పిర్యాధులు చేసి పరిష్కరింప జేసుకోవాలని పట్టణ ప్రజలు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమస్యల వేగవంతమైన పరిష్కారంతో
పట్టణ నివాసితుల జీవన పరిస్థితులు మరియు జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు అన్ని విధాలా కృషి చస్తామని మునిసిపల్ కమీషమర్ హామీనిచ్చారు. (Story : ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం)