Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతా క్లీన్‌ అండ్ గ్రీన్ సాధించడమే కూటమి లక్ష్యం

రాష్ట్రమంతా క్లీన్‌ అండ్ గ్రీన్ సాధించడమే కూటమి లక్ష్యం

0

రాష్ట్రమంతా క్లీన్‌ అండ్ గ్రీన్ సాధించడమే

కూటమి లక్ష్యం

వినుకొండలో అభివృద్ధి పనులకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన

న్యూస్‌తెలుగు/ వినుకొండ‌ : రాష్ట్రమంతా క్లీన్ అండ్ గ్రీన్ సాధించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అందుకోసమే పట్టణాలు, పల్లెల్లో పెద్దఎత్తున సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వ్యర్థాల నుంచి సంపదసృష్టి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినుకొండ మార్కాపురం రహదారిలోని 15వ వార్డులో సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన రూ.13.71 లక్షలతో సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భూమిపూజ నిర్వహించి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గతంలో చెత్తమీద పన్నువేసిన వైకాపా చెత్త ప్రభుత్వం వేల టన్నుల చెత్తను ఎక్కడబడితే అక్కడపడేసిందన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మార్చుతున్నామని. వినుకొండలో ఎక్కడా చెత్త, మురుగు కనిపించడానికి వీల్లేదన్నారు. చెత్త కనిపిస్తే తీసుకెళ్లి సంపద సృష్టించాలని అధికారులకు సూచించారు. వినుకొండ నియోజవర్గంలో ఎస్టీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం కోసం కూడా ఇటీవలే ముఖ్యమంత్రి రూ.2కోట్ల నిధులు ఇచ్చినట్లు తెలిపారు. పట్టణమంతా పారిశుద్ధ్య పనులు బాగా చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్‌ను అభినందించిన జీవీ బజార్లను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ప్రజలకూ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే మొత్తం రోడ్లు, సీసీ డ్రెయిన్లు పూర్తి చేస్తామన్నారు. ఎన్నెస్పీ కాలనీ గ్రౌండ్‌లో ఒక పార్కు, స్టేడియం, టీటీడీ కళ్యాణ మండపం, షాదీఖానా, ఎస్సీ భవన్ నిర్మించి ఇస్తామన్నారు. వినుకొండలో మొక్కలు పెంచడం, పరిశుభ్రంగా ఉంచడాన్ని ఉద్యమంగా చేపట్టాలని సూచించారు. గ్రామాల్లోనూ పెద్దఎత్తున ఉపా దిహామీ పనులు చేపడుతున్నామన్న జీవీ 17500 కి.మీ. మేర సీసీ రోడ్లు, 10వేల కి.మీ. సీసీ డ్రెయిన్లు నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో 2030 నాటికి 50% జనాభా పట్టణాలు, నగరాల్లోనే ఉండబోతోందని, అందుకు తగినరీతిలో ప్రణాళికాబద్దమైన అభివృద్ధిని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో సీఎం సూచనల మేరకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మున్సిపల్ శాఖమంత్రి నారా యణ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పేదరికం లేని సమాజం, తలసరి ఆదాయం పెంపు, ప్రతి ఇంటికో ఉద్యోగం, గ్రామానికో పారిశ్రామికవేత్త, 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ ఛైర్మన్ దస్తగిరి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, వార్డు కౌన్సిలర్ పీవీ సురేష్ బాబు, జనసేన ఉమ్మడి జిల్లాల కార్యదర్శి నిశ్శంకర శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు సౌదగర్ జానీబాషా, రియల్ ఎస్టేట్ జానీ, సుభానీ పఠాన్, చికెన్ బాబు, గంధం సుబ్బారావు, అడుసుమిల్లి రామారావు, తదితరులు పాల్గొన్నారు. (Story : రాష్ట్రమంతా క్లీన్‌ అండ్ గ్రీన్ సాధించడమే కూటమి లక్ష్యం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version