ఆధ్యాత్మిక విజ్ఞానం పెంచుకోవడం చాలా అవసరం
పోలి పాడ్యమి పూజల్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన
న్యూస్‌తెలుగు/ వినుకొండ : సన్మార్గంలో జీవించడం, ఆధ్యాత్మికంగా విజ్ఞానం సంపాదించుకోవడం చాలా అవసరమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మనిషికి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుందో అప్పుడే సంతోషం, శాంతి లభిస్తుందన్నారు. వినుకొండ కొత్తపేటలోని శ్రీమహాగణపతి దేవాలయంలో సోమవారం పోలి స్వర్గం పూజలు ఘనంగా జరిగాయి. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వ్యాస మహర్షి రాసిన స్కంద పురాణం ప్రకారం కార్తికమాసం చివరిరోజు అమవాస్య తర్వాత తిథిని పోలి పాడ్యమిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగానే ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనులో చీఫ్ విప్ జీవీ దీపం వెలిగించి అరటిదొప్పలపై పెట్టి వదిలారు. ప్రత్యేక పూజలు చేసి వేదాశీర్వచనాలు పొందారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కొత్తపేటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విశేషమని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, స్వర్గప్రాప్తి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. సంతోషం, శాంతి, ఇవ్వనీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడి ఆశీస్సులతోనే సిద్ధిస్తాయన్నారు చీఫ్‌విప్ జీవీ.ఇంకా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు. పివి సురేష్ బాబు, గుడి కమిటీ పెద్దలు పాల్గొన్నారు. (Story : ఆధ్యాత్మిక విజ్ఞానం పెంచుకోవడం చాలా అవసరం)