Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  సీనియర్ చిత్రకారులు డాక్టర్.వజ్రగిరి జెస్టిస్ కు “స్ఫూర్తి పురస్కారం”

 సీనియర్ చిత్రకారులు డాక్టర్.వజ్రగిరి జెస్టిస్ కు “స్ఫూర్తి పురస్కారం”

0

సీనియర్ చిత్రకారులు డాక్టర్.వజ్రగిరి జెస్టిస్ కు

“స్ఫూర్తి పురస్కారం”

న్యూస్‌తెలుగు/ వినుకొండ‌ : బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ గుంటూరు, విశాఖ సంస్కృతి మాస పత్రిక వారు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీ బహుమతీ ప్రదాన కార్యక్రమంలో భాగంగా.. గుంటూరు కామ్రేడ్ కొరటాల సమావేశ మందిరంలో ఈ నెల 8 న జరుగబోయే కార్యక్రమంలో చిత్రకళా రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పురస్కారాలు అందుకున్న డాక్టర్ జెస్టిస్ కు ఈ స్ఫూర్తి పురస్కారం అందజేయనున్నట్లు. కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ కార్టూనిస్ట్ బండికల్లు జమదగ్ని జి. ఐ. సి.,ఏ గ్రేడ్ సర్వేయర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వినుకొండ రాజకీయ ప్రముఖులు, లాయర్లు, కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు పాస్టర్లు చిత్రకారులు, డాక్టర్ జెస్టిస్ కు అభినందనలు తెలిపారు, వినుకొండ సీమకు స్ఫూర్తిప్రదంగా నిలవాలని ప్రశంసించారు. (Story :  సీనియర్ చిత్రకారులు డాక్టర్.వజ్రగిరి జెస్టిస్ కు “స్ఫూర్తి పురస్కారం”)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version