పదునేట్టాంబడి పూజలో పాల్గొన్న సింగిరెడ్డి వాసంతి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఘనపూర్ మండల కేంద్రంలో 18సార్లు మాలదరించి నారికేళ గురుస్వామిగా శబరిమల వెళుతున్న చిన్న ఆంజనేయులు గౌడ్ గురుస్వామి వారి స్వగృహంలో పడిపూజ కార్యక్రమం గోపాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యములో ఘంగా నిర్వహించారు. ఇట్టి పూజలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి కూతురు డాక్టర్.ప్రత్యూష పాల్గొన్నారు. స్వామీ వారి అభిషేక సేవలో నిరంజన్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామి వారిని అభిషేకించారు. గోపాలకృష్ణ గురుస్వామి గౌరవ నిరంజన్ రెడ్డి దంపతులకు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గురుస్వామి ఆంజనేయులు గౌడ్ గారిని నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. 1వార్డ్ కౌన్సిలర్ కాగితాల.లక్సమినారాయణ తన స్వగృహంలో అయ్యప్ప స్వామీ పటం పూజ నిర్వహించి స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. పూజలో పాల్గొన్న మాజీ మంత్రి గారికి ముత్తుకృష్ణ గురుస్వామి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.నిరంజన్ రెడ్డి ని లక్ష్మినారాయణ శాలువాతో సత్కరించారు. ఈ పూజలో వాకిటి.శ్రీధర్,బీచుపల్లి యాదవ్, నందిమల్ల.అశోక్, ఉంగ్లమ్. తిరుమల్ ,కాగితాల.గిరి గురుస్వాములు పాల్గొన్నారు. (Story : పదునేట్టాంబడి పూజలో పాల్గొన్న సింగిరెడ్డి వాసంతి నిరంజన్ రెడ్డి)