డిసెంబర్ 3 న తెలంగాణ యూత్ డే సదస్సును విజయవంతం చేద్దాం
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ జన సమితి అనుబంధ సంఘాలు యువ జన సమితి & విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి సందర్భంగా డిసెంబర్ 3 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో “తెలంగాణ యూత్ డే” సదస్సును విజయవంతం చేద్దాం అని తెలంగాణ జన సమితి వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల స్ఫూర్తిని మరిచి పరిపాలన చేసింది. గత నాలుగు సంవత్సరాలుగా అమరుడు శ్రీకాంతాచారి వర్థంతిని తెలంగాణ యూత్ డే గా నిర్వహిస్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల, యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేము లేవనెత్తిన జాబ్ క్యాలెండర్ ఏర్పాటు, రెగ్యులర్‌గా ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల, మెస్ బిల్లుల పెంపు, స్కిల్ సెంటర్ల ఏర్పాటు తదితర డిమాండ్లను BRS ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ 10 నెలలలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వీటిని పరిష్కరించింది. గత పదేళ్ళలో బీఆర్ఏస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను తయారు చేసింది. కానీ ఒక లక్షా యాబైవేల ఉద్యోగాలు భర్తీ చేశామని తప్పుడు ప్రచారం చేసుకుంది. పది నెలలలో ప్రజా ప్రభుత్వంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. జాబ్ క్యాలెండర్ ద్వారా మరిన్ని నోటిఫికేషన్లను జారీచేస్తుంది. గత బీఆర్ఏస్ పాలనలో ప్రయివేటు, ఐటీ రంగాలలో కూడా తెలంగాణ భూమిపుత్రులకు ఉద్యోగాలు దక్కలేదు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసి ఈ రంగాలలో ఉద్యోగ ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నిరుద్యోగులు, యువత తరపున కృతజ్ఞత తెలుపుతున్నాం” అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో యువత సమగ్రాభివృద్ధికై ఒక యువజన విధానం రూపొందించాల్సి ఉంది. తెలంగాణ స్థానిక యువకులకే పరిశ్రమలలో మెజారిటీ ఉద్యోగాలు దక్కేలా ఒక ప్రత్యేక చట్టం రావాల్సిందిగా కోరారు.(Story : డిసెంబర్ 3 న తెలంగాణ యూత్ డే సదస్సును విజయవంతం చేద్దాం