శిరిడి సాయిబాబా మందిరం నందు ‘పోలీ స్వర్గం కోనేరు పూజా ‘
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక బోసు బొమ్మ సెంటర్ శ్రీ సమర్థ సద్గురు శిరిడి సాయిబాబా వారి మందిరం నందు కార్తీకమాసం సందర్భంగా మానస శివరాత్రి సందర్భంగా సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు 30 అడుగుల వెడల్పుతో పోలీ స్వర్గం కోనేరు ఏర్పాటు చేసి, మధ్యలో ఉత్సవ శివలింగమును ప్రతిష్టించి మహిళా భక్తులచే అరటి బోధలతో ఒక్కొక్క వత్తులు ఏర్పాటుచేసి దీపములు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు శాస్త్రి మాట్లాడుతూ. ఈ పోలీ స్వర్గం కోనేరు చరిత్ర ఈ కార్యక్రమంలో తెలుపుతూ జ్యోతులతో కోనేరులోని శివ దర్శనం చేసుకుని మహిళా భక్తులు దంపతులు జన్మ తరింప చేసుకున్నారని, ఎన్నో క్షేత్రాలు దర్శించిన రాని పుణ్యఫలం కార్తీకమాసంలో ఒక్క కోనేరులో జ్యోతి వెలిగించిన అది ఎంతో పుణ్యమను ఇచ్చి శివ సానిధ్యమును పొందుతారని వశిష్ట మహర్షి జనక మహారాజుకు ఈ విషయాన్ని వివరించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ నిరవకులు దగ్గరుండి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. (Story : శిరిడి సాయిబాబా మందిరం నందు ‘పోలీ స్వర్గం కోనేరు పూజా ‘)