Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గురజాడ అభ్యుదయ దార్శనికుడు

గురజాడ అభ్యుదయ దార్శనికుడు

0

గురజాడ అభ్యుదయ దార్శనికుడు

– జనసేన నేత గురాన అయ్యలు

న్యూస్ తెలుగు / విజయనగరం : మహాకవి గురజాడ అప్పారావు గొప్ప సంఘ సంస్కర్త, ఆధునిక అభ్యుదయ వాది అని జనసేన నేత గురాన అయ్యలు పేర్కొన్నారు.

గురజాడ అప్పారావు వర్ధంతిని పురస్కరించుకొని గురాన అయ్యలు కార్యాలయంలో గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ సమాజానికి గురజాడ చేసిన సేవలను కొనియాడారు.
తన రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చారని, ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
తోటి వారికి సహాయాన్ని అందించాలని గురజాడ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఆయన ఆశయాలను భావి తరాలకు అందించడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు.

పార్వతీపురం నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌ ఆదాడ మోహన్ రావు మాట్లాడుతూ మహాకవి గురజాడ అప్పారావు రచనలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో నడవాలని, ఆయన భావాలు, అందించిన రచనలు ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు.

ఈ కార్యక్రమంలో జన సైనికులు డోలా రాజేంద్ర ప్రసాద్ , ఎంటి రాజేష్. మేడపిల్లి పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version