గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రన్నింగ్ మారధాన్ పోటీలలో వినుకొండ వాసి
న్యూస్ తెలుగు/వినుకొండ : న్యూఢిల్లీలోని జవహల్ లాల్ నెహ్రూ స్టేడియంలో డిసెంబర్ 1న జరగనున్న గ్రీన్ మారథాన్ మరియు డిసెంబర్ 8న జైపూర్ లో ఇండియన్ ఆర్మీ హానర్ రన్ వారి ఆధ్వర్యంలో జరగనున్న పరుగు పందెం పోటీలలో డిసెంబర్ 15న వైజాగ్ ఇండియన్ నేవీ మారధాన్ వారి ఆధ్వర్యంలో జరగనున్న పరుగు పందెం పోటీలలో పాల్గొనబోతున్నట్లు మరియు వీటన్నిటితో పాటు 2025 ఫిబ్రవరి నెలలో లడక్ లో 09 రోజులపాటు జరగనున్న ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఏ.ఎస్ ఎఫ్.ఎల్ రన్నింగ్ మారథాన్ పోటీలలో పాల్గొనేందుకు లడక్ వెళుతున్నట్లు పరుగుల వీరుడు అబ్దుల్లా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ.. ఆసియాలో మొదటి మరియు ప్రపంచంలోనే అత్యధికంగా ఘనీభవించిన పాంగోగ్ సరస్సు ఉన్న ఎప్పుడు మైనస్ ఉష్ణోగ్రతలు ఉండే లడక్ లో ఎముకలు కొరికే చలిలో 41 కిలోమీటర్లు, 21 కిలోమీటర్లు మరియు 05 కిలోమీటర్లు పరువు పందెం పోటీలలో పాల్గొనే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావించి దేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, పల్నాడు జిల్లాకి, వినుకొండ పట్టణానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేందుకు సిద్ధమవుతున్నానన్నారు.ఇటీవల కాశ్మీర్లో జరిగిన మారథాన్ పోటీలలో పాల్గొన్నప్పుడు ఇండియన్ ఎలైడ్ రన్నింగ్ మారధాన్ కోఆర్డినేటర్ డాక్టర్ సునీత గోద్రా నాలోని ప్రతిభను గుర్తించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో పాల్గొనే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పోటీలలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు 70 వేల రూపాయలు చెల్లించవలసి ఉంది. నిరుపేద ఐన తనకు దాతలు ఆర్థికంగా సహకరించి చేయూతనందిస్తే తప్పకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశారు.(Story : గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రన్నింగ్ మారధాన్ పోటీలలో వినుకొండ వాసి)