Home ఒపీనియన్‌ నూతన పోచమ్మ ఆలయ ప్రారంభం బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

నూతన పోచమ్మ ఆలయ ప్రారంభం బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

0

నూతన పోచమ్మ ఆలయ ప్రారంభం బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

న్యూస్ తెలుగు/ వనపర్తి : వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయం ప్రారంభం ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన బోనాల పండుగలో శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో రణంగా స్వాగతం పలికారు. బోనమెత్తిన మహిళలతో ఊరేగింపుగా ఎమ్మెల్యే ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ఉత్సవాల సందర్భంగా గ్రామ మహిళలు ఆడే బొడ్డెమ్మ ఆటలలో స్థానిక నాయకులు కిచ్చారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : నూతన పోచమ్మ ఆలయ ప్రారంభం బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version