సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే
జనసేన నేత గురాన అయ్యలు
న్యూస్ తెలుగు/విజయనగరం : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అనిజనసేన నేత గురాన అయ్యలు అన్నారు.
జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని గురువారం గురాన అయ్యలు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ దేశంలో కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన తొలి వ్యక్తి పూలే అని కొనియాడారు.
శతాబ్దాల నాడే అణగారిన వర్గాల కోసం, స్త్రీ విద్య కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్లిన మహాత్మా జ్యోతిరావు పూలే
చూపిన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజల హృదయాల్లో నేటికీ నిలిచి ఉన్నారని కొనియాడారు. వారి ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళిగా పేర్కొన్నారు.
జన సేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచనా విధానం.. పూలే ఆలోచనలకు దగ్గరగా ఉండే సూత్రమన్నారు.
ఆ మహనీయుని అడుగు జాడల్లో జనసేన ప్రస్థానం కొనసాగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జనసైనికులు
చింతా కాశీనాయుడు, నాగులపల్లి ప్రసాద్, సిరిపురపు దేముడు,ఎంటి రాజేష్ , ఎమ్ .పవన్ కుమార్ , గొల్లపల్లి మహేష్ , పృథ్వీ భార్గవ్, జి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.(Story :సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే)