మమతలో అరుదైన శస్త్ర చికిత్స
న్యూస్‌తెలుగు/ఖమ్మం :ఖమ్మం లోని పువ్వాడ నాగేశ్వరరావు ఫౌండర్ గా ఏర్పాటు చేసిన మమత ఆసుపత్రిలో అరుదైన శాస్త్ర చికిత్స చేసినట్లు ఆసుపత్రి కార్యదర్శి పువ్వాడ జయశ్రీ మీడియాకు తెలిపారు. పొద్దుటూరు గ్రామానికి చెందిన ఎం వెంకయ్య అనే 80 ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్ ట్యూమర్ను తొలగించినట్లు పేర్కొన్నారు. సుమారు 6, 7 లక్షల ఖర్చు అయ్యే చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోనే తక్కువ ఖర్చుతో చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
ఆ ట్యూమర్ కూడా మెదడు నుంచి వెన్నుపూసకు వచ్చే భాగంలో చిన్న మెదడు మేధోకాలదు మధ్యలో ఏర్పడిందని డాక్టర్ జగదీష్ తెలిపారు.
మమత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 26 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మనుత ఆసుపత్రిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా ఎంతో మంది రోగులు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్నట్లు తెలిపారు.
మమత ఫౌండర్ చైర్మన్ పువ్వాడ నాగేశ్వరరావు, చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ సారధ్యంలో ఆసుపత్రికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ నెల 15న అతనికి శస్త్ర చికిత్స నిర్వహించామని ఈ శస్త్రచికిత్స కూడా ఎంతో కష్టతరమైందన్నారు . శస్త్రసికస్థ చేసిన డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తల వెనక బాగం కండరాల మధ్య నుంచి ఈ శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. అటువంటి శస్త్ర చికిత్సను మమతలో విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం రోగి వెంకయ్య పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని. డిశ్చార్జి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనురాధ, వైద్య బృందం తదితరులు. (Story : మమతలో అరుదైన శస్త్ర చికిత్స )