మెగా డీఎస్సీ-2024 సిలబస్ వచ్చేసిందోచ్..
నేటి నుంచి వెబ్‌సైట్‌లో వివరాలు
అభ్యర్థుల సన్నద్ధతకు అవకాశం
న్యూస్ తెలుగు/అమరావతి: నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇప్పటికే 16,317 పోస్టులతో కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్ విడుదలపైనా దృష్టి పెట్టంది. ఈలోగా అభ్యర్థుల సౌకర్యార్థం, వారి ప్రిపరేషన్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకుగాను డీఎస్సీ`2024 సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 27వ తేదీ బుధవారం 11 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో సిలబస్‌ను ఉంచుతారు. ఆయా సబ్జెక్టులకు అనుగుణంగా సిలబస్‌ను ఉంచుతారు. దీనివల్ల డీఎస్సీకి ప్రిపరేషన్ సాధించే వారికి ఒక స్పష్టత వస్తుంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే..16,317 పోస్టులను భర్తీ చేసేలా దస్త్రంపై సంతకం చేశారు. ఆ తర్వాత అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఏపీ టెట్`2024(జులై) సెషన్ పరీక్షలను నిర్వహించడంతో డీఎస్సీ`2024 నోటిఫికేషన్‌కు అంతరాయం ఏర్పడిరది. టెట్ పరీక్షల అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతలో ఎస్సీల రిజర్వేషన్లు, గిరిజన ఆశ్రమ పాఠశాల్లో పోస్టుల అంశంపై స్పష్టత లేకపోవడం తదితర సాంకేతిక కారణాల రీత్యా నోటిఫికేషన్ వాయిదా పడిరది. డీఎస్సీ`2024 నోటిఫికేషన్‌కు జాప్యం జరిగినా,ప్రభుత్వం నుంచి కూడా డీఎస్సీ నియామకాలపై సానుకూలంగా ఉంది. అందులో భాగంగా ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలకు సిద్ధం మయ్యేందుకు వీలుకల్పిస్తూ మెగా డీఎస్సీ సిలబస్ ఉదయం 11 గంటల నుంచి apds2024.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వి.విజయ్‌రామరాజు తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. (Story : మెగా డీఎస్సీ-2024 సిలబస్ వచ్చేసిందోచ్..)