వినుకొండ ఎంపీడీవో కార్యాలయంలో
రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యంగా వజ్రోత్సవాలను మండల ప్రజపరిషత్ , వినుకొండ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అభివృద్ధి అధికారి మూల వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం రాజ్యాంగ ఔన్నత్యం, ప్రాథమిక హక్కులు, విధులు పై చర్చించారు, సదరు చర్చ లో జిల్లా అభివృద్ధి అధికారి మూల వెంకటరెడ్డి మాట్లాడుతూ. భారత్ రాజ్యాంగం మహోన్నతమైన దని అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ స్వేచ్చ, సమనత్వాలకి పట్టం కట్టినదని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి పెద్దపీట వేసినదని ప్రశంసించారు. పౌరులందరు ప్రాథమిక హక్కుల మీద అవగాహన పెంచుకోవాలని ప్రాథమిక విధులను గురించి తెలుసుకుని వాటిని బాధ్యతతో నిర్వర్తించాలని కోరారు. రాజ్యాంగం పీఠిక ను ప్రమానాపూర్వకం గా చవిన అనంతరం ప్రజలకు ప్రాథమిక విధులపై అవగాహన కల్పించే కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.పుట్టారెడ్డి, ఏవో.రవి, ఎం ఆర్ సి ప్రభాకర్ రావు, వెంకటేశ్వరరావు వర్మ, వెంకీ, వినుకొండ మండల కార్యాలయం స్టాప్ పాల్గొన్నారు. (Story ; వినుకొండ ఎంపీడీవో కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు)