ఘంటసాల ఆరాధనోత్సవాలకు
గుమ్మడి సంధ్యారాణికి ఆహ్వానం
న్యూస్ తెలుగు/సాలూరు : డిసెంబరు 15వ తారీఖున జరగబోయే 26 వ ఘంటసాల ఆరాధనోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణిని ఆహ్వానించడం జరిగిందని. ఘంటసాల ఆరాధనోత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం సాలూరు రిక్రియేషన్ క్లబ్ ఆవరణంలో ఉదయం 9 .30గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సంగీత ఆరాధన ఉత్సవాలు జరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో నాలుగు ఆర్కెస్ట్రా బృందాలు పాల్గొంటారని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల ఆరాధనోత్సవ కమిటీ సభ్యులు ఎన్ రాంప్రసాద రావు. దార ముక్కల నరసింహామూర్తి చందు మాస్టర్ .షేక్ ఇస్మాయిల్ వరి పండా ప్రసాద్. కె నరసింహారావులు పాల్గొన్నారు. (Story : ఘంటసాల ఆరాధనోత్సవాలకు గుమ్మడి సంధ్యారాణి కి ఆహ్వానం)