పాత బస్టాండ్ ప్రజలకు అందుబాటులోకి తేవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పాత బస్టాండ్ ప్రజలకు అందుబాటులోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,
జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. రాజా రామేశ్వరరావు వనపర్తి బస్టాండ్ ప్రారంభం అయినప్పుడు పాత బస్టాండు కొరకు స్థలం కేటాయించి లీజుకి ఇవ్వడం జరిగిందని, అప్పటినుండి 50 సంవత్సరాలు వనపర్తి చుట్టుపక్కల తాలూకాలో గ్రామాల ప్రజలకు సేవలందించిందని, కొత్తకోట, మధునాపూర్, ఆత్మకూర్, నారాయణపేట, రాయచూర్ మార్గాలకే కాకుండా పెద్దమందడి, మహబూబ్నగర్, ఘనపూర్ వివిధ మండలాలకు వెళ్లే బస్సులు.. ప్రయాణికులను తీసుకొని వెళుతుందని కొన్ని సంవత్సరాల క్రింద కొందరు తమ సొంత ప్రయోజనాలకు పాత బస్టాండ్ ఆక్రమించి కమర్షియల్ గా ఉపయోగించుకున్నారని, దానితో మూడు సంవత్సరాల నుండి ఐక్యవేదిక ప్రజలకు అందుబాటులోకి పాత బస్టాండ్ తేవాలని పోరాటం చేసిందని, దానికి స్పందించిన పాలకులు అధికారులు ముందుకు వచ్చి పాత బస్టాండు ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, బి ఎస్ పి పట్టణ అధ్యక్షుడు గంధం భరత్, నాయకులు బొడ్డుపల్లి సతీష్ శివకుమార్, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. (Story : పాత బస్టాండ్ ప్రజలకు అందుబాటులోకి తేవాలి)