Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఐదేళ్ల జగన్‌ పాలనలో 50 ఏళ్లు వెనక్కిపోయిన రాష్ట్రం

ఐదేళ్ల జగన్‌ పాలనలో 50 ఏళ్లు వెనక్కిపోయిన రాష్ట్రం

0

ఐదేళ్ల జగన్‌ పాలనలో 50 ఏళ్లు వెనక్కిపోయిన రాష్ట్రం

అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో మాట్లాడిన ఛీప్ విప్ జీవీ ఆంజనేయులు

న్యూస్ తెలుగు/వినుకొండ : ఒక్కఛాన్స్ అన్న మాయ మాటలు నమ్మిన పాపానికి జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 50ఏళ్లు వెనక్కి పోయిందని అసెంబ్లీ చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు . రూ. 10లక్షల 50వేల కోట్ల అప్పులు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేయడం, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను వంచించడం, గుంతల రోడ్లు, దోపిడీ, హత్యా రాజకీయాలు మినహా వైకాపా రాష్ట్రానికి చేసిందేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. గురువారం ఈ మేరకు బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతుూ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన జీవీ. అయిదేళ్ల జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. వైకాపా అన్నివిధాలుగా ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించేలా మంచి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని ప్రశంసించారు. వైకాపా పాలనంతా నైజం కక్ష తీర్చుకోవడం, రాజకీయాలను అడ్డం పెట్టుకుని దాడులు చేయడం తప్ప మరేమీ లేదన్నారు. ఆర్థికనేరస్థులు, హంతకులు, దోపిడీదారులకు, దాడులు చేసిన వారికే పదవులు, ప్రమోషన్లు, మంత్రి యోగాలు కల్పించారని దుయ్యబట్టారు. అందుకే అలాంటి అరాచకవాదులు, అసమర్థులు వద్ద మళ్లీ సీఎం గా చంద్రబాబే కావాలనిప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు ఎమ్మెల్యే జీవీ. సీఎం చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి విజన్-2047 తీసుకున్నారని తెలిపారు. వైకాపా పాలనలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లు తప్ప సాధించింది ఏంటో చెప్పాలన్నారు. 5ఏళ్ల లో ఒక్కటైనా కొత్త రోడ్డు వేశారా అని నిలదీశారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రమంతా నంబర్‌-1గా వేసిన రోడ్లను నాశనం చేశారని దుయ్య బట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ గుంటలన్నీ పూడ్చడానికి ఈ బడ్జెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.600 కోట్లు ఇచ్చారన్నారు. అవసరమైతే ఇంకా రూ.300 కోట్లు ఇస్తామన్నారు. గుంతలు లేని రోడ్లు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. చెత్త మీద పన్ను వేసిన ఏకైక చెత్తప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అన్న జీవీ. అలా చెత్త మీద పన్ను వేసిన ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రతి పట్టణంలో గుట్టలుగా పేరుకుపోతే ఏం చేసిందని ప్రశ్నించా రు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చెత్తపన్నును రద్దు చేయడంతో పాటు వాళ్లు పోగుచేసిన చెత్తను కూడా ఎత్తిపోయాల్సిన బాధ్యత తీసుకోవాల్సి వచ్చిం దన్నారు. ఉద్యోగాలని చెప్పి వాలం టీర్ల ఉద్యోగాలు ఇచ్చిన యువతను మోసం చేశారన్నారు. డిగ్రీ, పీజీ చేసిన వాళ్లను కూడా కేవలం రూ.5వేలు ఇచ్చిన వెట్టి చాకిరీ చేయించారన్నారు. ఇదేనా వాళ్లిచ్చిన ఉద్యోగాలని ఆవేదనగా ప్రశ్నించారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌గా ఉన్న పరిస్థితి ప్రభుత్వం స్పీడ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చారని కొనియాడారు. ఎవరైనా పరిశ్రమలు పెడతామంటే వారికి కావాల్సిన భూ కేటాయింపులు మొదలు విద్యుత్‌, అనుమ తులన్నీ శరవేగంగా ఇస్తున్నారన్నారు. 2014-19 మధ్య సీఎం చంద్రబాబు ఏపీని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేశారన్నారు. కానీ జగన్ పాలనలో దానిని మొత్తం నాశనం చేశారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు , హత్యలు, ఘోరాలకు రాష్ట్రాన్ని వేదికగా చేశారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం సొంత బాబాయి హత్య చేస్తే హంతకులకు ఎంపీ సీట్లు ఇచ్చి ప్రమోషన్ ఇస్తారా అని అని వాపోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడులకు వెళ్లిన వారికి పదవులు ఇచ్చి మంత్రులు చేస్తారా అని ప్రశ్నించారు. నాటి రాక్షస పాలనలో ఎవరెక్కువ అరాచకాలు చేస్తే వారికి ప్రమోషన్లు, మంత్రి పదవులు ఇచ్చారన్నారు. దళితులను హత్యచేసి డోర్ డెలివరీ చేసిన వారికి పదవులా అని విస్మయం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ తరలిపోయిన కంపెనీలను తిరిగి తీసుకుని వస్తున్న, దేశవిదేశాల సంస్థలను రప్పించేలా కృషి చేస్తున్న మంత్రి లోకేష్‌కు అభినందనలు తెలుపుతున్నా అన్నారు. ఆ కృషికి ఫలితంగానే విశాఖలో టీసీఎస్‌ లూలూ గ్రూప్‌ వంటి సంస్థలు వస్తున్నాయన్నారు. సుపరిపాలన, ఉద్యోగ ఉపాధి అవకాశాల దిశగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోందన్నారు. ప్రతిరైతు ఆనందంగా ఉండాలని, రాష్ట్ర వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల తలసరి ఆదాయంలో దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్‌-1గా మార్చడానికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనలు ఫలించి అమరావతి, పోలవరానికి నిధులు సాధించుకున్నామన్నారు.(Story:ఐదేళ్ల జగన్‌ పాలనలో 50 ఏళ్లు వెనక్కిపోయిన రాష్ట్రం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version