Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ టిడ్కో గృహ లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయాలి

టిడ్కో గృహ లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయాలి

0

టిడ్కో  గృహ లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయాలి

ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు డిమాండ్

న్యూస్ తెలుగు /వినుకొండ : పట్టణంలో సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆఫీసులో ట్విట్ కో ఇళ్ళ లబ్ధిదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గత 8 సంవత్సరాల క్రితం చంద్రబాబు ప్రభుత్వంలో ట్విట్ కో ఇళ్ళు పేద, మధ్యతరగతి ప్రజలకు కట్టిస్తామని చెప్పి సింగల్ బెడ్ రూమ్ 500 రూపాయలు చొప్పున, డబుల్ బెడ్ రూమ్ 50 వేల రూపాయలు చొప్పున లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేశారు.
2019 ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో చంద్రబాబు ప్రభుత్వంలో లబ్ధిదారులకి నిర్మాణం పూర్తి చేసి ఇవ్వలేకపోయారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చంద్రబాబు ప్రభుత్వం లో పెట్టిన స్కీం కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి వినుకొండ పట్టణానికి 7 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి జాలపాలెం దగ్గర జగనన్న కాలనీ పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ అది పూర్తి చేయలేదు. మరలా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా లబ్ధిదారులకి తక్షణమే ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకి అప్పజెప్పాలని, మీ రాజకీయ ప్రయోజనాల కోసం లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టకూడదని ఈ సమావేశంలో పాల్గొన్న ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు అన్నారు. సంక్రాంతి లోపు ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులు అప్పజెప్పకపోతే సిపిఐ ఎంఎల్ లేబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు తీసుకెళ్లి లాటరీ వేసి గృహాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు లబ్ధిదారుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలని, అద్దెలు కట్టలేక అనేకమంది పేదలు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వారి ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే గృహాలు లబ్ధిదారులకు అప్పజెప్పాలని లేనిపక్షంలో ప్రజా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు ఎస్కే ఫిరోజ్, మునగపాటి ప్రసాద్, భాస్కర్, కామా వెంకటేశ్వర్లు, పట్టణంలోని లబ్ధిదారులు పాల్గొన్నారు. (Story : టిడ్కో గృహ లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version