Home వార్తలు  ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్) రిలీజ్ డేట్ పోస్టర్

 ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్) రిలీజ్ డేట్ పోస్టర్

0

 ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్) రిలీజ్ డేట్ పోస్టర్

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా న్యూస్ :   రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్), గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొందింది. ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ‘కేశవ చంద్ర రమావత్’ మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈనెల 22న సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని ‘బలగం’తో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కమెడియన్, దర్శకుడు వేణు లాంచ్ చేశారు. ‘టీం వీరందరికీ ఆల్ ద బెస్ట్.  ఇది మరో బలగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చెప్పారు వేణు.

‘సినిమాను తెలంగాణ ఆంధ్ర రిలీజ్ చేస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ గారికి (దీప ఆర్ట్స్) జోర్దార్ సుజాత రాకేష్ దంపతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వరల్డ్ వైడ్ గా అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాని రిలీజ్ అవుతున్న ఈ చిత్రం అద్భుత ఘనవిజయం సాధిస్తుందని దర్శకుడు అంజి పేర్కొన్నారు.

ఈ చిత్రంలో జోర్దార్ సుజాత, ధనరాజ్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్, రవి రచ్చ, మై మధు, లోహిత్ కుమార్ ఇతర కీలక పాత్ర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తెలంగాణ మాస్ట్రో ‘చరణ్ అర్జున్’ మ్యూజిక్ అందిస్తున్నారు.

నటీనటులు : రాకింగ్ రాకేష్, అన్నన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత, లోహిత్ కుమార్, బలగం మైమ్ మధు, రచ్చ రవి, కృష్ణ భగవాన్, అంజి, సాయి చరణ్ కిష్టప్ప, జబర్దస్త్ ప్రవీణ్, జబర్దస్త్ నవీన్, జబర్దస్ రాజ్ రాజ్, జబర్దస్త్ జబర్దస్త్ , కీర్తి లత, బలగం తాత, జబర్దస్త్ కర్తానందం

సాంకేతిక సిబ్బంది
బ్యానర్: విభూది క్రియేషన్స్
స్క్రీన్ ప్లే, రైటింగ్ & ప్రొడ్యూసర్: రాకింగ్ రాకేష్
సినిమాటోగ్రఫీ & దర్శకత్వం: ‘గరుడవేగ’ అంజి
సంగీతం: తెలంగాణ మాస్ట్రో ‘చరణ్ అర్జున్’
ఎడిటర్: మధు
ఆర్ట్ డైరెక్టర్: మహేష్ బల్లంట్
డైలాగ్స్: రాజ్ కుమార్ కుసుమ
చీఫ్ కో-డైరెక్టర్: హేమంత్
కో-డైరెక్టర్: రామారావు, ఉండ్రావట్టి నాగరాజు
మేనేజర్: గణేష్ నాయక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముదిగొండ సాయికుమార్
పీఆర్వో: వంశీ శేఖర్ (Story :  ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్) రిలీజ్ డేట్ పోస్టర్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version