సిద్దయ్య గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణమునకు దాతలు సహకరించండి
ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని సిద్దయ్యగుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణమునకు దాతలు సహకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆలయ కమిటీ సమావేశంలో ఆలయ నిర్మాణం త్వరితగతిన చేపట్టేందుకు చర్చలు నిర్వహించామని తెలిపారు. ధర్మవరంలో దాతలకు కొదవలేదని, 6 కోట్ల వ్యయముతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టదలిచామని తెలిపారు. దాతలు ఎవరైనా ధన రూపేనా, వస్తు రూపేనా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. దాదాపు 300 సంవత్సరాల పైన గల ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయం అని, మహిమ గల దేవుడు అని తెలిపారు. పట్టణములో ఈ ఆలయాన్ని పూర్వవైభవము తెప్పించేందుకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ ప్రయత్నానికి ప్రజలు, దాతలు ముందుకు రావాలని వారు కోరారు. నేటి నుంచి స్వయంగా దాతల ఇళ్ల వద్దకు వెళ్లి ఆలయ చరిత్రను తెలుపుతూ విరాళాలను అడగడం జరుగుతుందని తెలిపారు. 2025 సంవత్సరము నాటికి గుడి నిర్మాణం పూర్తి చేయదలిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్లూరు నరసింహులు, గడ్డం పార్థసారథి, కలవల మురళీధర్, అంబటి అవినాష్, ఓవి ప్రసాద్, అంజలి కృష్ణ, బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు.(Story:సిద్దయ్య గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణమునకు దాతలు సహకరించండి)