జాతీయ సమైక్యత కోసం పోరాడిన యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : జాతీయ సమైక్యత కోసం పోరాడిన యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హర్ష వర్ధన్,కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి,డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. స్థానిక రేగాటిపల్లె రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ఆవరణలో గురువారం నాడు జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్,ఎన్ఎస్ఎస్ పీవో హర్ష వర్ధన్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశపు తొలి హోం శాఖ మంత్రిగా సేవలు అందించి,ఎన్నో స్వాతంత్ర్య రాజ్యాలను భారత యూనియన్ లో కలిపి, ధీటైన పోరాట పటిమ గలిగి ఉక్కుమనిషిగా పెరుపొందారని వారు పేర్కొన్నారు. స్వతంత్ర్య భారతదేశం తొలి ఉప ప్రధానిగా, ఉక్కు మనిషిగా, ధృడమైన సంకల్పంతో స్వతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించి సామాజిక, రాజకీయ నాయకుడిగా దేశ సమగ్రత, సమైక్యతకు మార్గ నిర్దేకులుగా నిలిచి దాదాపు 565 సంస్థానాలను విలీనం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. మహనీయుని జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2014 నుండి జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకొంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో రమేష్,అధ్యాపక బృందం,విద్యార్థులు పాల్గొన్నారు. (Story : జాతీయ సమైక్యత కోసం పోరాడిన యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్)