అభివృద్ధికి ఆమడ దూరం దళిత కాలనీల పరిస్థితి
న్యూస్‌తెలుగు/వినుకొండ : అభివృద్ధికి ఆమడ దూరంలో వైకంటి శివప్రసాద్ ఎస్. టి యానాది కాలనీ. ప్రభుత్వాలు మారుతున్నాయి దళిత కాలనీల పరిస్థితి మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు ప్రభుత్వాలపై మండిపడ్డారు. శుక్రవారం రాత్రి వినుకొండ మండలం విఠంరాజు పల్లి పంచాయతీ వైకంటి శివప్రసాద్ ఎస్. టి యానాది కాలనీలో సిపిఐ పార్టీ శాఖ సమావేశం చేవూరి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శాఖ సమావేశంలో సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. “ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ దళిత కాలనీలు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయని ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఎస్టీ యానాది కాలనీ లో రోడ్లు పరిస్థితి ఏమాత్రం బాగాలేక డ్రైనేజీ వ్యవస్థ లేక ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు సోకి ప్రజలు ఇబ్బంది పడకముందే కాలనీలో పారిశుద్ధ్య మెరుగుపరచాలని, కాలనీ శుభ్రపరచాలని, అలాగే ఎస్. సి., ఎస్. టి. ల నిధులతో కాలనీకి రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొప్పరపు మల్లికార్జున, నాగరాజు, ఆదయ్య, సుజాత, లక్ష్మి, పేరమ్మ, నాగరాణి, దేవి, తదితరులు పాల్గొన్నారు. (Story : అభివృద్ధికి ఆమడ దూరం దళిత కాలనీల పరిస్థితి)