రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోండి
చేనేత జౌళి శాఖ ఏడి రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ రీజనల్ ఆఫీసర్ రాజారావు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ ఏడి. రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ రీజనల్ ఆఫీసర్ రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేనేత కార్మికులకు చేనేత జౌళి శాఖ ద్వారా అమలు అయ్యే వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అదేవిధంగా నూతన చేనేత సహకార సంఘాల ఏర్పాటు వలన సభ్యులకు చేనేత ముడి సరుకు పై ఐదు శాతం జీఎస్టీ రాయితీ ఉంటుందని, ట్రిప్టు పండు, నోరు యూనిట్లు ఉచిత విద్యుత్తు, ఆర్ ఎం ఎస్ ఎస్ పథకం ద్వారా 15 శాతము యార్న్ సబ్సిడీ, తదితర ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. చేనేత కార్మికులకు ముద్రా రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని, ముద్రా రుణాలపై 20 శాతం సబ్సిడీ కూడా ఉంటుందని తెలియజేశారు. ఆర్ ఎం ఎస్ ఎస్ ద్వారా చేనేత సహకార సంఘాలకే కాకుండా వ్యక్తిగత చేనేత కార్మికులకు చేనేత వ్యవస్థాపకులకు చేనేత ప్రొడ్యూసర్ కంపెనీలకు చేనేత స్వయం సహాయక సంఘాలకు కూడా 15 శాతము అందించబడునని తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లాలో సోమందేపల్లి ధర్మవరం ప్రాంతాలలో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసి, చేనేత కార్మికులకు జాకార్డులు, లిఫ్టింగ్ యంత్రాలు, తదితర పరికరాలను 90 శాతంతో అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జిల్లాలోని 50 సంవత్సరాలు వయసు పైబడిన 12,712 మంది చేనేత కార్మికులకు నెలకు 4000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల పెన్షన్ రూపంలో అందించడం జరుగుతుందని తెలిపారు. కావున ఇటువంటి పథకాలను చేనేత కార్మికులు అందరూ కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకొని సుఖవంతమైన జీవనం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం ఓంకార ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివో రమణారెడ్డి ఏడిఈఓ లు సీనా నాయక్, రాజేశ్వరి, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోండి)