Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు

0

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్జి ఎఫ్. యోగా అండర్-14, అండర్-17 పోటీలు అనంతపురంలోని అశోక్ నగర్ లో గల ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం జరిగిందని, ఈ జిల్లా పోటీలో ఎస్ జి ఎఫ్ యోగాలో అండర్-14 లో ఎనిమిదవ తరగతి చదువుతున్న కే.పవన్ కుమార్, అండర్-17 లో 9వ తరగతి చదువుతున్న డి. జస్వన్ కుమార్ రాష్ట్రస్థాయికి ఎంపికగా, ఎస్జీఎఫ్ హాకీ అండర్-19 లో అనంతపురంలో జిల్లాస్థాయి పోటీలు జరిగాయి. ఇందులో రాష్ట్రస్థాయికి యశ్వంత్ అనే విద్యార్థి ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ పద్మశ్రీ తో పాటు అధ్యాపక బృందం, బోధనేతర బృందం, తోటి విద్యార్థులు, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version