ఘనంగా జరిగిన తొమ్మిదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు
ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శీే బా నగేష్ గుప్తా, డాక్టర్. శీబా సంగీత
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని మెయిన్ బజార్ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఆపోజిట్ వద్దగల విజయలక్ష్మి ఆయుర్వేద అండ్ ఫిజియోథెరపీ క్లినిక్ లో ఘనంగా 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం వేడుకలను ఆయుర్వేద డాక్టర్లు శీభా నగేష్ గుప్తా, శీబా సంగీత, శీబా సుస్మిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత అర్చకులచే ధన్వంతరి చిత్రపటానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆది వైద్యుడు, దేవ వైద్యుడు, ఆరోగ్య ప్రదాత అయిన భగవాన్ శ్రీ ధన్వంతరి పాల సముద్రం నుంచి ఉద్భవించడం జరిగిందని తెలిపారు. ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించి గత తొమ్మిది సంవత్సరాలనుండి సంపూర్ణ ఆరోగ్యకరమైన రోగరహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలన్న, మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ధన్వంతరి జయంతిని, జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలుగా జరుపుకోవడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమం ఆయుర్వేద సలహాదారులైన శీబా రామ లింగయ్య చేతుల మీదుగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ధన్వంతరి అనుగ్రహం లభిస్తే దీర్ఘ రోగాలు అసాధ్యకరమైన రోగాలను కూడా అధికమించి పరిపూర్ణ ఆరోగ్య వంతులు అవుతారని తెలిపారు. దీర్ఘాయుష్షుగా ప్రతి వ్యక్తి జీవించడానికి ఆయుర్వేద వైద్యము మాత్రమే కలదని తెలిపారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో త్వరలో ఆయుర్వేద కళాశాలను ఏర్పాటు చేయడానికి కృషిచేసిన ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలను వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు తోపాటు జిల్లా అఓపా ఇంచార్జ్ అన్న లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జరిగిన తొమ్మిదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు)