కౌన్సిల్ సమావేశం వాయిదా
మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) ; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఈనెల 30వ తేదీ నిర్వహించాల్సిన కౌన్సిల్ సమావేశము కొన్ని అనివార్య కారణముల వలన నవంబర్ ఒకటవ తేదీ నాటికి వాయిదా వేయడం జరిగిందని పురపాలక సంఘ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ ధర్మారం ఎమ్మెల్యే, మంత్రి అశోక్ కుమార్ యాదవ్ బిజీ షెడ్యూల్ ఉన్నందున కౌన్సిల్ సమావేశమును మున్సిపల్ చైర్ పర్సన్ అనుమతితో నవంబర్ ఒకటవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించబడునని వారు తెలిపారు. కావున కౌన్సిలర్లు అందరూ కూడా సకాలంలో హాజరు కావాలని వారు కోరారు.