శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి సమావేశం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి వినుకొండ లోని రెడ్డి సంఘం కార్యాలయం నందు సోమవారం సమావేశం జరిగింది. రెడ్డి పెద్దలు అందరూ హాజరై నవంబర్ 17న జరిగే రెడ్డి కార్తీక వన భోజనాలు గురించి మరియు స్కాలర్ షిప్స్ గురించి చర్చ జరిగింది. దీనికి పెద్దలందరూ ఆమోదించి అనేక మంది పిల్లలు స్కాలర్ షిప్ కొరకు విరాళాలు ఇచ్చారు. అలాగే వనభోజనాలకు వస్తు రూపం లో అనేకమంది సరుకులు ఇస్తాము అని హామీ ఇచ్చారు . అలాగే వెళ్లటూరు రోడ్డు నందు రెడ్డి బిల్డింగ్ మరియు సత్రం వర్క్ కూడా చాలా స్పీడు గా నడుస్తుంది. దీనికి కూడా అనేకమంది దాతలు విరాళాలు జఖ్ఇచ్చివున్నారు. త్వరలో బిల్డింగ్ పూర్తి చేస్తామని, దానిలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెట్టి రెడ్డి యువతకు ఉపాధి అవకాశాలను పొందే విధంగా చేస్తామని ప్రెసిడెంట్ శివారెడ్డి అన్నారు. అలాగే సెక్రెటరీ పెద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 17న జరిగే వన భోజనాలు కార్యక్రమంకు, స్కాలర్షిప్ కార్యక్రమంకు అందరూ సహకరించాలని , మరియు విరాళాలు కూడా రెడ్డి పెద్దలు ఇవ్వాలని కోరారు. అలాగె ట్రస్టు చైర్మన్ కర్నాటి చెన్నకేశవ రెడ్డి మాట్లాడుతూ. ట్రస్టు కార్యక్రమాలకు కూడా అందరూ సహకరించాలని, పేద మరియు మెరిట్ రెడ్డి స్టూడెంట్స్ వుంటే వారు స్కాలర్ షిప్స్ కి అప్లై చేసుకోవాలిని, అప్లికేషన్స్ రెడ్డి సంఘం ఆఫీసు నందు, గీతమ్స్ బ్లూమ్స్ నందు, చెకేశవరెడ్డి ఆఫీసు నందు అందుబాటులో వుంటాయని , అలాగే నవంబర్ 10 లోపు అప్లై చేసుకోవాలని ఆ తేది దాటిన తరువాత అప్లికేషన్ తీసుకొనబడవు అని అన్నారు. అలాగే లేట్ కంది శ్రీనివాస రెడ్డి కుమారుడు ,ఉచిత దంత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి రెడ్డి పెద్దలు అందరూ అన్ని విషయాలు గమనించి, అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి పెద్దలు మూలక రామతులసి రెడ్డి , కొత్త కృష్ణా రెడ్డి ,గంధం బాలిరెడ్డి , కేసరి ప్రకాష్ రెడ్డి, తుపాకుల కొండల్ రెడ్డి, సోము వెంకటేశ్వర రెడ్డి, రొడ్డా శ్రీనివాసరెడ్డి , బిక్కం వెంకట నారాయణ రెడ్డి, మాలపటి భాస్కర్ రెడ్డి, లేళ్ళ అంజిరెడ్డి, తుమ్మా రామకృష్ణా రెడ్డి,బలరాం రెడ్డి,ఎరుకల రెడ్డి,వెంకట రమణ రెడ్డి, జనాపాల వెంకటేశ్వర రెడ్డి,సంజీవ రెడ్డి,జయకృష్ణ రెడ్డి ,నారాయణ రెడ్డి, నాగిరెడ్డి, రామాంజనేయ రెడ్డి పాల్గొన్నారు. (Story : శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి సమావేశం)