ఏఐఎస్ఎఫ్ వినుకొండ నియోజకవర్గ నూతన కార్యవర్గం
ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలి : ఏఐఎస్ఎఫ్ డిమాండ్
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక శివయ్య భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్ ) వినుకొండ నియోజకవర్గ నిర్మాణ మహాసభను సోమవారం నిర్వహించారు. ఈ మహాసభకి ముఖ్య అతిధిలుగా సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల నాసర్ జీ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బుదాల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విద్యారంగా సమస్యలు పరిష్కారం, విద్యార్థుల పోరాటం వల్లే జరుగుతుందని . దేశ స్వాతంత్రం లో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని , 89 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని పొరాటాలు కొనసాగిస్తూనే ఉందని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్య విధానాం వలన అనేక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమవుతున్నారని, ఈ విధానానికి వ్యతిరేకంగా వినుకొండ నియోజకవర్గం లో పోరాటాలు నిర్వహించాలని అన్నారు. రాష్ట్రం లో సుమారుగా 70 వేల మంది ఎస్.సి , ఎస్.టి
, బి.సి విద్యార్థులు జీవో నెంబర్ 77 వలన ఉన్నత పీజీ విద్యకు దూరమవుతున్నారని, గతంలో యువగళం పాదయాత్రలో నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ జీవో నెం 77 ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట మీద నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని , పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మటిక్ చార్జీలను విడుదల చేయాలని అన్నారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పెద్దేటి అభిషేక్, బోధనం శ్రీనివాస్, మరొక 30 మంది సభ్యులతో నియోజకవర్గ సమితిని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. (Story : ఏఐఎస్ఎఫ్ వినుకొండ నియోజకవర్గ నూతన కార్యవర్గం)