Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం 

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం 

0

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం 

జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నామాల శంకరయ్య

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని 27వ వార్డులో వైయస్సార్ కాలనీలో గల బీసీ సంక్షేమ సంఘం సాకే రామచంద్ర అధ్యక్షులు మృతి చెందడంతో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నామాల శంకరయ్య ఆధ్వర్యంలో వారి ఇంటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నామాల శంకర, నరసింహులు వారు మాట్లాడుతూ రామ్ చంద్ర హఠాత్ మరణం మా సంఘానికి తీరని లోటు అని, ఒక మంచి నాయకున్ని కోల్పోవడం మాకు చాలా బాధగా ఉందని వారు తెలిపారు. తదుపరి మృతి చెందిన సాకే రామచంద్ర భార్యకు 11 వేల రూపాయలు, అందులోనే 5000 రూపాయలు జిల్లా అధ్యక్షులు నామాల శంకర సొంత డబ్బులను ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి బీసీ సంక్షేమ సంఘం పట్టణ కమిటీ 6000 రూపాయలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బండి వెంకటేష్, జంగమన్న, తిరుపాల్, అన్నం లక్ష్మీనారాయణ, యోగానంద, రేగాటిపల్లి రవి, వెంకట్ రాముడు, నాగేంద్ర, నామాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version