రైతాంగ ప్రజా నిరసన సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు
బి.ఆర్.ఎస్ శ్రేణులకు దిశనిర్దేశం చేసిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లా కేంద్రంలో రేపు జరగబోయే రైతాంగ ప్రజా నిరసన సదస్సు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నాయకులకు వివిధ బాధ్యతలను అప్పగించారు. పదివేల మంది రైతులు పాల్గొనే సభ విజయవంతం చేయాలని మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. కొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ గారికి ముఖ్య అతిథి హరీష్ రావు పూలమాలలు సమర్పించి ర్యాలీగా ఉదయం 9.00గంటలకు బయలు దేరి 10.00గంటలకు సభాస్థలికి చేరుకుంటారని అన్నారు. సభా ఏర్పాట్ల గురించి రాష్ట్ర నాయకులు అభిలాష్ రావు,గట్టు యాదవ్,వాకిటి.శ్రీధర్,పి.రమేష్ గౌడ్ ,నందిమల్ల.అశోక్, చీర్ల.విష్ణు సాగర్, జిల్లా విద్యార్థి కోఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్ మర్రికుంట.శ్రీను,చిట్యాల.రాము, జోహేబ్బ్ హుస్సేన్,,క్రాంతి తదితరులు పాల్గొన్నారు. (Story : రైతాంగ ప్రజా నిరసన సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు)