నియమ నిబంధనల ప్రకారమే టపాసులను విక్రయించాలి
ఆర్డిఓ మహేష్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఈనెల 30వ తేదీ నరక చతుర్దశి, 31వ తేదీ దీపావళి సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రజలందరూ కూడా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని, అదేవిధంగా లైసెన్స్ కలిగిన టపాసు అమ్మ కప్పు దారులు నియమ నిబంధనల ప్రకారమే టపాసులను విక్రయించాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో సమావేశ భవనంలో అనుమతి పొందిన టపాసుల విక్రయ దారులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, స్థానిక ఎమ్మార్వో నటరాజ్, ఫైర్ ఆఫీసర్ రాజు. వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్, టూ టౌన్ సిఐ రెడ్డప్ప, ముదిగుబ్బరూరల్ సీఐ. శ్యామ్ రావు పాల్గొని స్థానిక ప్రభుత్వ క్రీడా మైదానంలో టపాసుల విక్రయ పద్ధతి పై పలు విషయాలను తెలియజేశారు. అనంతరం ఆర్డిఓ మహేష్ మాట్లాడుతూ ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా, సాఫీగా జరిగే విధంగా సహకరించాలని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా సూచించిన నియమాలను తప్పక పాటించాలని తెలిపారు. ప్రతి టపాసు విక్రయించే దుకాణమునకు, మరొక దుకాణమునకు మూడు మూడు అడుగుల దూరం ఉండాలని తెలిపారు. తెచ్చిన టపాసుల స్టాకును పట్టణానికి దూరంగా ప్రత్యేకమైన ఓ గోడౌన్ లేదా ప్రత్యేకమైన గదిలో ఉంచాలని తెలిపారు. అపరిచితులు రాకుండా చూసుకోవాలని, అగ్గిపెట్టె, కిరోసిన్ పెట్రోల్ లాంటివి ఉండరాదని తెలిపారు. గ్రౌండ్లో ప్రథమ చికిత్స కేంద్రము తో పాటు అగ్నిమాపక కేంద్రం కూడా ఉంటుందని తెలిపారు. ప్రతి లైసెన్స్ టపాసు విక్రయదారుడు విద్యుత్తు, ఫైర్, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులతో తప్పక అనుమతి తీసుకోవాలని తెలిపారు. ప్రతి దుకాణానికి కరెంటు అమర్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి దుకాణంలో రెండు బకెట్లో ఇసుకలు, రెండు బకెట్లో నీరు తప్పక ఉండాలని తెలిపారు. డివిజన్ పరిధిలోని ఐదు మండలాలలో మొత్తం 20 మంది మాత్రమే టపాసుల విక్రయము కొరకు అనుమతి పొందాలని తెలిపారు. ఇందులో ధర్మవరం ఏడు దుకాణాలు, బత్తలపల్లి రెండు దుకాణాలు, ముదిగుబ్బ ఏడు దుకాణాలు, తాడిమర్రి ఒక దుకాణం, చెన్నై కొత్తపల్లి మూడు దుకాణాలు కలవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏఓ- కతీ జూన్ కుప్రా డివిజన్ పరిధిలోని ఎమ్మార్వోలు స్వర్ణలత, నారాయణస్వామి, సురేష్, తదితరులు పాల్గొన్నారు. (Story : నియమ నిబంధనల ప్రకారమే టపాసులను విక్రయించాలి)